బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేట్ అయ్యింది అతనే..!

  • December 5, 2020 / 09:28 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ అవినాష్ ఎవిక్షన్ పాస్ తో సేఫ్ అయ్యాడు. లాస్ట్ వరకూ కూడా చాలా టెన్షన్ పడ్డాడు. ఈ వీక్ ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవుతానని ముందుగానే గ్రహించాడు. అందుకే సాధ్యమైనంత వరకూ టాస్క్ లో తన అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఓటింగ్ లో ముందుకు దూసుకుపోవడం వల్ల ఈవారం వెనకబడిపోయాడు.

టాప్ 7 మెంబర్స్ లో ఒకడిగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ హౌస్ లో ఉన్నంత సేపు చాలా ఎంటర్ టైన్ చేశాడు. అందరికంటే కూడా బాగా ఫన్ ఛేశాడు. తనదైన స్టైల్లో ఆడియన్స్ మనసలు గెలిచాడు. రెండోవారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన అవినాష్ జెర్నీ ఎట్టకేలకి ముగిసింది. వైల్డ్ కార్డ్ గా జోకర్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ అందర్నీ తన నటనతో, జోకులతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. స్టేజ్ పైన ఉన్న హోస్ట్ నాగార్జునని సైతం తన జోక్స్ తో మెప్పించాడు. ఇప్పుడు ఇలా హౌస్ నుంచి నిష్క్రమించాడు.

అవినాష్ ఎలిమినేషన్ కి అతని గేమ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా గేమ్ చివరివరకూ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ అవ్వక తప్పలేదనే చెప్పాలి. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus