Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

బాబు మోహన్ (Babu Mohan) నిన్నటితరం స్టార్ కమెడియన్. ఆల్మోస్ట్ 700 సినిమాల్లో నటించారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కానీ.. ఆయన కోరుకున్న పాత్రలు దక్కడం లేదు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, సుహాస్- కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన ‘ఉప్పు కప్పురంబు’ వంటి సినిమాల్లో నటించారు బాబూ మోహన్. కానీ అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు.

Babu Mohan

బాబు మోహన్ పోషించిన పాత్రలకు కూడా అప్రీషియేషన్ లభించలేదు. ఈ ఏడాది వచ్చిన ‘హే బల్వంత్’ సినిమాలో కూడా నటించారు. అది కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అన్నీ ఎలా ఉన్నా.. ఇటీవల వచ్చిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో బాబు మోహన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్ నడిచింది. కానీ సినిమాలో ఈయన పాత్ర లేదు. బహుశా ఎడిటింగ్లో పోయిందేమో అని అంతా అనుకున్నారు.

కానీ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టారు బాబు మోహన్ (Babu Mohan). అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ” ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నన్ను ఎంపిక చేసి, మేకప్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ డ్రెస్సులు, గెటప్ బ్రహ్మాండంగా ఉందని చిత్ర బృందం ఎంతో ప్రశంసించింది. అంతా బాగానే అయ్యింది కదా అని సంతోషించేలోపే, ఎటువంటి సమాచారం లేకుండా నా పాత్రని తీసేశారు. నన్ను షూటింగ్..కి కూడా పిలవలేదు. మధ్యలో పిలుస్తారేమో అని ఆశగా ఎదురుచూశాను. కానీ లాభం లేకుండా పోయింది. నాకంటే గొప్ప నటులు దొరికి ఉంటారని వాళ్ళు భావించి ఉండొచ్చు. కానీ కనీసం ఆ విషయం చెప్పే కనీస సంస్కారం కూడా టీమ్..కి లేకపోవడం బాధాకరం.

అయితే, నన్ను కాదనుకున్నందుకే ఆ చిత్ర బృందానికి శని పట్టుకున్నట్టు ఉంది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది… ఒక్క రోజు కూడా ఆడకుండా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాది ‘లక్కీ లెగ్’ సెంటిమెంట్. గతంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నేను లేకుండా ‘చెవిలో పువ్వు’ సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తర్వాత ‘ప్రేమఖైదీ’లో నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అదే విధంగా ‘ది ప్యారడైజ్’ ప్లాప్ అవ్వాలనే ఉద్దేశంతోనే దేవుడు నన్ను ఆ సినిమా నుండీ తప్పించి ఉంటాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు మోహన్ (Babu Mohan).

 పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus