Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

పట్టిందల్లా బంగారం.. ఈ మాటకు బాలీవుడ్‌లో సరైన అర్థం చెప్పాలి అంటే ఇద్దరు నటుల గురించి చెప్పాలి. అందులో ఒకరు బాలీవుడ్‌ ఖిలాడీ హీరో అక్షయ్‌ కుమార్‌ అయితే.. రెండోది బాలీవుడ్‌ క్వీన్‌ అని ఫీల్‌ అయ్యే కంగనా రనౌత్‌. ఆమె అలా ఫీల్‌ అవ్వడానికి కారణం.. కొన్నేళ్ల పాటు ఆమె ఏ సినిమా కథ ఎంచుకున్నా అది విజయం సాధించడం పక్కా అనే మాట వినిపించేది. ఆమెకు అందుకే హిట్‌ హీరోయిన్‌ అనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

Kangana Ranaut

అంతేకాదు.. ఇప్పుడు ఏ సినిమా చేసినా బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితమే ఎదురవుతోంది. ఇంకా చెప్పాలంటే ఏది ముట్టుకున్నా మట్టే అనే పరిస్థితి ఏర్పడింది. కావాలంటే మీరే చూడండి గత పదేళ్లుగా కంగన చేసిన ఏ సినిమాకు విజయం దక్కలేదు. ఒకవేళ దక్కినా చావు తప్పి కన్ను లొట్టబోయిన విజయాలే. రీసెంట్‌గా విడుదలైన ‘భారత భాగ్య విధాత’ సినిమాకు ఊహించని పరాజయం ఎదురైంది. థియేటర్లలో ఖాళీ కుర్చీల వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా దారుణంగా డిజాస్టర్ అవుతోంది. గత వారం ఆమె నటించిన భారత భాగ్య విధాత విడుదలైన సంగతి తెలిసిందే. 2008లో దేశాన్ని వణికించిన ముంబయి 2008 టెర్రరిస్టుల దాడుల సమయంలో ఒక ఆసుపత్రి సిబ్బంది చూపించిన ధైర్య సాహసాలు, సేవలను హైలైట్ చేసే ఉద్దేశంతో మనోజ్ తపాడియా తెరకెక్కించిన సినిమా ఇది.

జూన్‌ 12 విడుదలైన ఈ సినిమా 19వ తేదీ నాటికి కేవలం రూ.7.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రోజుకు సుమారు రూ. కోటి అన్నమాట. సినిమాకు సుమారు రూ.60 కోట్లు బడ్జెట్‌గా పెట్టింది ప్రొడ్యూసర్‌ కంగన. ఇప్పుడు రోజుకో కోటి రూపాయల చొప్పున వసూళ్లు వస్తే లాభాల సంగతి పక్కన పెడితే అసలుకే ఎసరొస్తుంది.

ఇక ఈ సినిమాకు ముందు ఆమె చేసిన ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్‌’, ‘చంద్రముఖి 2’, ‘ధాఖడర్‌’, ‘తలైవి’ ఇబ్బందికర ఫలితాలే అందుకున్నాయి.

 ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus