‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు చేశారు. కానీ ఏదీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే గతేడాది చివరిలో వచ్చిన ‘ఓజి'(OG) మాత్రం కొంతవరకు ఫ్యాన్స్ ఆకలి తీర్చిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి.. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుచిచూపించింది. ‘ఓజి’ లో పవన్ కళ్యాణ్ ను చాలా పవర్‌ఫుల్..గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు సుజీత్.
సినిమాలో పవన్ కనిపించే ప్రతి సీన్… ఇంట్రో సీన్ మాదిరే డిజైన్ చేశాడు. దీంతో థియేటర్లలో అభిమానులు తెగ ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సైతం ‘ఓజి యూనివర్స్’ లో భాగమవ్వాలని ఆశపడుతున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఆల్రెడీ ‘ది రిటర్న్ ఆఫ్ ఓజి’ అనే టైటిల్ ను టీం రెజిస్టర్ చేయించినట్టు టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల చూసుకుంటే ‘పవన్ క్రియేటివ్ వర్క్స్’ సోషల్ మీడియా హ్యాండిల్లో ‘ఓజి యూనివర్స్’ గురించి హింట్స్ ఇస్తూ పోస్టులు పడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా దర్శకుడు సుజిత్.. పవన్ కళ్యాణ్ కి నెరేషన్ ఇస్తున్నట్టు ఓ ఫోటో తీసి పోస్ట్ చేశారు టీమ్. అభిమానులకి ఈ పోస్ట్ మంచి కిక్ ఇస్తుంది అని చెప్పాలి. ‘పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేసినట్టు ‘ఓజి యూనివర్స్’ పనులు మొదలయ్యాయి’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ కంటే ముందుగా ‘హరిహర వీరమల్లు’కి కూడా సీక్వెల్ ఉంటుందని నిర్మాత ఏ.ఎం.రత్నంకి ప్రామిస్ చేశారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘ఎంత హీరో ప్రామిస్ చేసినా దానికి సీక్వెల్ ఎలా చేస్తారు.చేసినా బయ్యర్స్ ఎవరు కొంటారు? అనే డౌట్లు ఎవ్వరికైనా రావచ్చు. ఆ సినిమాకి సీక్వెల్ చేసినా చేయకపోయినా.. ఏ.ఎం.రత్నంని ఆడుకోవాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టుకే..! అంటే ఏ.ఎం.రత్నంకే..! అలాంటప్పుడు ఏ.ఎం.రత్నంకి పవన్ న్యాయం చేయాల్సిందే కదా.
‘ఓజి యూనివర్స్’ కి ఏ.ఎం.రత్నంని నిర్మాణ భాగస్వామిగా జత చేసినా ఆయన కోలుకునే అవకాశం ఉంటుంది. మరి పవన్ మైండ్లో ఏముందో?!