టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తన పేరుపై చిన్న బ్యానర్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. అదే ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’. మొదటి ప్రయత్నంగా ‘బలగం'(Balagam) అనే చిన్న సినిమా చేశారు.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చాలా వరకు కొత్తవాళ్ళు/ లేదా గుర్తింపు లేని వాళ్ళే నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి వారు అనమాట. ‘జబర్దస్త్’ కమెడియన్ గా పాపులర్ అయిన వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.2023 మార్చి 3న పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి వీకెండ్ ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. మంచి వసూళ్లు సాధించింది. నేటితో ‘బలగం’ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఒకసారి టోటల్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 8.60 cr |
| సీడెడ్ | 1.06 cr |
| ఆంధ్ర | 2.13 cr |
| ఏపీ + తెలంగాణ | 11.79 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.22 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 12.01 cr |
‘బలగం’ చిత్రం రూ.1.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.12.01 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా రూ.10.81 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.