Balakrishna: నిత్యాన్నదానం చేస్తూ అభిమానం చాటుకున్న బాలయ్య ఫ్యాన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ అంటే ఏం చేయడానికైనా సిద్ధపడే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ పేరు మీదట ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా బాలకృష్ణ (Balakrishna) అభిమాని ఉప్పుటూరి రామ్ చౌదరి అనే అభిమాని అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.అయితే ఈయన తన స్నేహితుడి ద్వారా బసవతారకం హాస్పిటల్లో రోగులు ఆకలి తీర్చుకోవడం కోసం కష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని చలించిపోయారు. ఈ క్రమంలోనే చేతనఫౌండేషన్ తన స్నేహితుల సహకారంతో ఈయన బసవతారకం హాస్పిటల్ లో ప్రతిరోజు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు. అయితే ఇప్పటికి ప్రతిరోజు ఏ హాస్పిటల్లో రోగులకు అన్నదానం ఏర్పాటు చేసే వారి ఆకలిని తీరుస్తున్నారు.హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల ఆహార పదార్థాలను రోగులకు అందిస్తూ బాలయ్య పై ఉన్నటువంటి తన అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా తన మంచి మనసును కూడా చాటుకున్నారు.

ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ ఇది చాలా గొప్ప విషయం అంటూ అతనిపై ప్రశంసల కురిపిస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus