Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయ తెలిసిందే. పవర్‌ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ సామాజిక అంశం గురించి ప్రస్తావన కానీ, నేపథ్యం కానీ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొరటాల శివ ఈ కాన్సెప్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి దర్శకుడు. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు దాదాపు ఇలాంటివే. అవి ఆయనకు విజయాన్ని కూడా అందించాయి.

Balayya – Koratala

అయితే, బాలయ్యతో చేస్తున్న సినిమా పేరు వింటుంటే.. ఏ సామాజిక అంశాన్ని ఈ సినిమా కథలో మిక్స్‌ చేశారు అనే డౌటనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా కొరటాల ‘వడ్రంగి’ అదేనండీ ‘కార్పెంటర్‌’ అనే పేరు పెడుతున్నారట. ఇలాంటి పేరు పెట్టి ఏ కథను బాలయ్యతో చెప్పించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. వడ్రంగి అంటే చెక్కను అందమైన వస్తువులను మలిచేవాడు. ఇప్పుడు బాలయ్య కూడా సమాజాన్ని అలా తన ప్రతిభతో మలిచే వ్యక్తిగా చూపించబోతున్నారా అనేది చూడాలి.

ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశానలు తెరకెక్కించే ఓ షెడ్యూల్ వచ్చే నెల చివరి వారంలో షురూ చేస్తారట. ఇందులో బాలయ్య మీద యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఈ షెడ్యూల్‌తో సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేసేలా 20 రోజులపాటు ప్లాన్‌ చేస్తున్నారట కొరటాల అండ్‌ కో. బాలయ్య గత సినిమాల్లోలాగే ఈ సినిమాలోనూ ఈ సీన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని చెబుతున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి కొరటాల ‘దేవర 2’ సినిమా పనులు చూస్తుండేవారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టి బాలయ్యతో ‘కార్పెంటర్‌’ సినిమా చేస్తున్నారు. అంత పెద్ద సినిమాను వదులుకుని ఈ సినిమా చేస్తూ మంచి విజయం అందుకుంటే ఆ కిక్కే వేరు. ఈ సినిమా టైటిల్‌ను వినాయకచవితికి కానీ, దసరాకు కానీ రివీల్‌ చేస్తారని టాక్‌.

జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus