RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

‘పెద్ది’ సినిమా హిట్టా, ఫ్లాపా.. అనేది ఇప్పుడు చర్చించి ఉపయోగం లేని అంశం. అయితే ఆ సినిమా రామ్‌ చరణ్‌ వెచ్చించిన సమయం, కోల్పోయిన మూమెంట్స్‌, పడ్డ కష్టాలు, తగిలిన గాయాలకు, ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌కి తగ్గ విజయం అందలేదు అనేది ఎవరూ కాదనలేని విషయం. అందుకే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు టేకింగ్‌ని, స్క్రీన్‌ ప్లేని ఒక మాట అంటున్నారు కానీ.. రామ్‌చరణ్‌ కష్టాన్ని మాత్రం తక్కువ చేయడం లేదు. ఆఖరికి యాంటీ ఫ్యాన్స్‌ (ఈ పదం వాడటం ఇష్టం లేకపోయినా అంటున్నాం) కూడా మెచ్చేసుకున్నారు.

RC 17

గతం గతః.. ఇప్పుడు రామ్‌చరణ్‌ చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు చేయబోయే సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, రెండోది సినిమా విడుదలకు ఎక్కువ రోజులు పడకుండా చూసుకోవడం. చరణ్‌ తన 17వ సినిమాను సుకుమార్‌తో చేస్తారని చాలా కాలం క్రితమే తేలిపోయింది. మొన్నీమధ్య ఓ ఈవెంట్‌లో సుకుమార్‌ ఈ సినిమా గురించి మాట్లాడకపోడానికి ఇష్టపడకపోయినా.. ఈ ప్రాజెక్ట్‌ అయితే ఉంది. ఈ మేరకు త్వరలో ఓ వీడియో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

నిజానికి ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఈ పాటికే వచ్చేసుండాలి. అయితే ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ సమయంలో రామ్‌చరణ్‌ గాయపడటంతో కొత్త సినిమా పనులు కాస్త ఆలస్యం చేద్దాం అనుకున్నారట. ఈ లోపు సుకుమార్‌ సినిమా కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. ఈ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన పుకార్లన్నీ నిజం కాదు.. తాము చేస్తున్న సినిమా జోనర్‌, లైన్‌ వేరే అంటూ ఆ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి సంబంధించిన షూట్‌ రిహార్సిల్స్‌ కూడా అయిపోయాయట.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ రైటింగ్స్‌ కూడా నిర్మాణ భాగస్వామి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు భాగాలు చేస్తారని వార్తలొచ్చిన ఈ సినిమా ఒక భాగమే ఉంటుంది. రూమర్లలో వచ్చినట్లుగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్, మాఫియా నేపథ్యం లాంటివి కాకుండా.. స్టయిలిష్ యాక్షన్ జోనర్‌లో చరణ్‌ను చూపించేలా లెక్కల మాస్టారు లెక్కలేసుకుంటున్నారట. అయితే.. దీనికి ఎక్కువ రోజుల సమయం పట్టించకుండా.. త్వరలో పూర్తి చేసి రిలీజ్‌ చేస్తే బాగుంటుంది.

నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus