గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్స్ ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా గురించి ఆలోచించవద్దని డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్టుపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. దర్శకులు చాలా మంది ఆయనతో సినిమా చేయడానికి రెడీ అంటున్నారు గాని బాలయ్య నుంచి మాత్రం పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించడం లేదట.
వినాయక్, బి.గోపాల్ బాగానే ప్రయత్నం చేశారు కానీ కథలు నచ్చలేదట. ఇక ఇటీవల క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని చెప్పిన ఒక స్టోరీ లైన్ పై బాలయ్య చాలా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. అయితే ఇంకా ఆ స్క్రిప్ట్ మొత్తం పూర్తవ్వలేదట. క్రాక్ సినిమా రిలీజైన తరువాత దర్శకుడు గోపి బాలయ్య కోసం అనుకున్న లైన్ ను డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి బాలయ్య ఆ దర్శకుడితో కొత్త సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు మొన్నటివరకు ఒక టాక్ వచ్చింది. కానీ నేడు F3 లాంచ్ అవ్వడంతో అవన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!