తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించినటువంటి బాబి తదుపరి చిత్రాన్ని బాలయ్యతో చేయబోతున్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాల విషయంలో డైరెక్టర్లను ఎలాంటి ఇబ్బంది పెట్టరు వారు చెప్పిన విధంగానే సినిమాలలో చేస్తూ ఉంటారు.
డైరెక్టర్ ప్యాకప్ చెప్పిన తరువాతనే బాలకృష్ణ క్యారవాన్ లోకి వెళ్తారు కానీ తన ఇష్టానుసారంగా సినిమా స్క్రిప్టులో జోక్యం చేసుకోవడం వంటివి అసలు చేయరు కానీ తనకు కనుక కోపం తెప్పిస్తే తన ముందు ఎవరున్నారనే విషయాన్ని కూడా బాలకృష్ణ లెక్క చేయరు. ఇలా ఇప్పటికే ఎంతోమంది అభిమానులు బాలయ్య చేతిలో తన్నులు తిన్నవారు ఉన్నారు. ఈ క్రమంలోనే మొదటిసారి బాలయ్య డైరెక్టర్ బాబి పై కోపడ్డారన్న వార్త వైరల్ గా మారింది.
బాలయ్యతో (Balakrishna) సినిమా కోసం బాబి సొంతంగా కొన్ని డైలాగ్స్ రాసి తన టీమ్ చేత బాలకృష్ణ దగ్గరికి పంపించారట బాలకృష్ణ ఆ డైలాగ్స్ చదివి ఆగ్రహంతో ఊగిపోయారని దీంతో డైరెక్టర్ బాబితో పాటు ఆయన టీం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!