అజిత్ సినిమాను రీమేక్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

  • July 6, 2019 / 04:39 PM IST

“అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి” అంటూ సావిత్రి ఆడియో ఫంక్షన్ లో కామెంట్ చేసి మహిళల ఆగ్రహానికి గురయ్యి.. ఆఖరికి క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “పింక్” సినిమా తెలుగు రీమేక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించనున్నాడని సమాచారం.

హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తమిళంలో ఆల్రెడీ అజిత్ చేస్తుండగా.. ఇప్పుడు అజిత్ కోసం చేసిన చిన్నపాటి మార్పులతో తయారు చేసిన కొత్త వెర్షన్ కథకు తెలుగు రీమేక్ గా రూపొందే చిత్రంలో బాలయ్య లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. తాప్సీ పాత్రను తమిళంలో శ్రద్ధ శ్రీనాథ్ కనిపించనుండగా.. మరి తెలుగులో ఆ పాత్ర ఎవరు పోషిస్తారనేది తెలియాలి. ఇకపోతే.. ఈ చిత్రంలో ముసలి లాయర్ గా కనిపించడం కోసం బాలయ్య సరికొత్త గెటప్ ట్రైల్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఎవరు రూపొందిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అప్పుడెప్పుడో బాలయ్యను లాయర్ కోట్ లో చూసిన నందమూరి అభిమానులు మరోసారి ఆయన్ను లాయర్ గా చూడడం కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus