Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

చిన్న సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని అందుకుంది ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. ఆ తర్వాత ‘డార్లింగ్’ అనే చిన్న సినిమాని కూడా నిర్మించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ‘సంబరాల యేటి గట్టి'(SYG) అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కూడా ఈ సంస్థ ఓ సినిమా సెట్ చేసుకున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరిగింది.

Hanuman2

మొత్తానికి ఇటీవల దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా ‘హనుమాన్ 2’(Hanuman2) పేరుతో ఆ ప్రాజెక్టును ప్రకటించింది ‘ప్రైమ్ షో..’ సంస్థ.! వాస్తవానికి ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘హనుమాన్ 2’ రూపొందుతోంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘హనుమాన్’ సీక్వెల్ ఐపీ(IP) రైట్స్ ప్రశాంత్ వర్మ వద్దే ఉన్నాయని అంతా అనుకున్నారు. ప్రైమ్ షో సంస్థకు రూ.23 కోట్లు చెల్లించి మరీ ‘మైత్రి..’ సంస్థ ఐపీ రైట్స్ దక్కించుకుంది.

అయినా ‘ప్రైమ్ షో..’ సంస్థ ‘హనుమాన్ 2’ అనౌన్స్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? అని అంతా అనుకున్నారు. ఇదే విషయంపై నిర్మాత చైతన్య రెడ్డికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తుంది. ‘ ‘హనుమాన్ 2’ రైట్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. ‘మైత్రి’ సంస్థ మాకు రూ.23 కోట్లు చెల్లించిన మాట వాస్తవమే..! కానీ అందులో చాలా విషయాలు ఉన్నాయి. ‘హనుమాన్ 2′ ఎవరి సొంతమూ కాదు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి.. మా దగ్గర కూడా రైట్స్ ఉన్నాయి’ అంటూ సమాధానం ఇచ్చారు చైతన్య రెడ్డి.

బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus