Balayya Babu: ఆ విధంగా చేస్తే మాత్రం బాలయ్య ఖాతాలో సరికొత్త రికార్డులు చేరతాయా?

Advertisement

ఏపీలో ఎన్నికల వల్ల పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన పనులు ఉండటంతో పెద్ద సినిమాలను ప్రకటించిన డేట్ కు రిలీజ్ చేసే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఏడాది మే నెల తర్వాత సరైన పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. జూన్, జులై నెలల కోసం ఏ సినిమా షెడ్యూల్ చేసుకోలేదు.

బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా జూన్ లేదా జులై నెలలలో ఈ సినిమా విడుదలైతే మాత్రం సులువుగా సరికొత్త రికార్డులు సొంతమవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాతే ఈ సినిమా మొదలైన నేపథ్యంలో జూన్ లేదా జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టం కాదు. ఈ సినిమా విషయంలో బాలయ్య, బాబీ ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.

బాలయ్య బాబీ కాంబినేషన్ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడంతో పాటు బాలయ్యకు తొలి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందించే సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉన్నాయని తెలుస్తోంది.

బాలయ్య (Balayya Babu) బాబీ కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీలో నటించే నటీనటులకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus