SPY Movie: స్పై మూవీకి అవే హైలెట్.. నిఖిల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

  • June 28, 2023 / 02:32 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. నిఖిల్ గత సినిమాలైన కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి నిఖిల్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు రిలీజ్ కు ముందే భారీ లాభాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్ చేరడం ఖాయమని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ మూవీ హవా తగ్గడంతో స్పై దూకుడు చూపించడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2 గంటల 15 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతోంది. రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పై మూవీ ట్రైలర్ కు ఇప్పటివరకు ఏకంగా ఇప్పటివరకు 13 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే (SPY Movie) ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పై మూవీలో బాలయ్య రెఫరెన్స్ ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సమాచారం. స్పై మూవీలో బాలయ్య అభిమానిగా నిఖిల్ కనిపిస్తారని జై బాలయ్య బీట్ కూడా వినిపిస్తుందని ప్రచారం జరుగుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. ఈ సినిమాతో నిఖిల్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఆశిద్దాం. స్పై మూవీతో నిఖిల్ ఖాతాలో మరో పాన్ ఇండియా సక్సెస్ చేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యాక్షన్ సన్నివేశాలు స్పై మూవీకి హైలెట్ కానున్నాయని భోగట్టా.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus