‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్ గా పేరొందిన యువ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపళ్ళ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన రెండో సినిమా ‘బ్యాండ్ మేళం'(Band Melam). స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ సినిమాతో సతీష్ జవ్వాజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ రంగంలోకి దిగి మరీ ప్రమోట్ చేయడంతో వార్తల్లో నిలిచింది ‘బ్యాండ్ మేళం’. అలాగే విజయ్ బుల్గెనిన్ సంగీతంలో రూపొందిన ‘తిప్పుకుంటావు’ ‘పల్లెల్లోని’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
దీంతో మార్చి 26న విడుదల కాబోతున్న ‘బ్యాండ్ మేళం’ పై కొంత బజ్ ఏర్పడింది. అయితే మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల ఓపెనింగ్స్ చాలా బ్యాడ్ గా నమోదయ్యాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| తెలంగాణ | 0.15 cr |
| సీడెడ్ | 0.03 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.16 cr |
| వరల్డ్ టోటల్ | 0.34 cr (షేర్) |
‘బ్యాండ్ మేళం’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నదేమీ కాదు. అయితే నెగిటివ్ టాక్ ఇంపాక్ట్ వల్ల వసూళ్లు ధారుణంగా నమోదయ్యాయి. 3 రోజులో ఈ సినిమా కేవలం రూ.0.34 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.66 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది.