Bandla Ganesh: చరణ్ ను డైమండ్ తో పోల్చి బండ్ల గణేష్.. ఏమైందంటే?

  • December 31, 2022 / 03:53 PM IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన బండ్ల గణేష్ టెంపర్ సినిమా తర్వాత సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను నిర్మించిన సినిమాలలో ఎక్కువ మొత్తం లాభాలు వచ్చిన మూవీ టెంపర్ అని తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆ సినిమా మంచి లాభాలను అందించిందని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఎవరితో తనకు విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు.

చరణ్ తో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నకు బండ్ల గణేష్ స్పందిస్తూ చరణ్ కోహినూర్ డైమండ్ అని కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని బండ్ల గణేష్ పేర్కొన్నారు. మళ్లీ నిర్మాతగా త్వరలో బిజీ అవుతానని ఆయన అన్నారు. సినిమాల విషయంలో తన జడ్జిమెంట్ రైట్ అవుతుందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. నా హీరోనే నాకు దేవుడు అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. రాజకీయాలకు తాను దూరమని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఒకప్పుడు కేటీఆర్ తాను చాలా క్లోజ్ అని బండ్ల గణేష్ తెలిపారు. రోజా తనకు సోదరి అని ఆమెకు నాకు మధ్య విభేదాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. తాను మనస్సులో ఏదీ దాచుకోకుండా మాట్లాడతానని బండ్ల గణేష్ కామెంట్లు చేయడం గమనార్హం. బండ్ల గణేష్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబినేషన్ లో మరో సినిమా త్వరలో వస్తుందని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బండ్ల గణేష్ సినిమాల్లో నిర్మాతగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే వార్త ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus