Bandla Ganesh: పవన్ కళ్యాణ్ విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్!

  • February 10, 2023 / 11:06 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కి అమితమైన అభిమానం అని అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గురించి జపం చేస్తూనే ఉంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు పొగుడుతూ ఉండే బండ్ల గణేష్ గత కొంతకాలంగా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి ఊసు ఎత్తటం లేదు.

ఇదిలా ఉండగా ఇటీవల రవితేజ ఫోటో షేర్ చేసి కళ్ళల్లో కసి, మీసంలో పౌరుషం, ముక్కు మీద రాజసం అంటూ ఒక క్యాప్షన్ పెట్టీ పోస్ట్ షేర్ చేశాడు. ఈ విషయం పై పవన్ అభిమానులు స్పందిస్తూ…” బండ్ల అన్న బండి పవన్ కళ్యాణ్ నుండి దారి మారి రవితేజ గారి రోడ్డులోకి వెళ్ళింది, దేవరను మరిచావా? భక్తి తగ్గిందా? “అని ప్రశ్నించారు.దీంతో బండ్ల గణేష్ స్పందిస్తూ… ” నేను హిందువుని శ్రీశైలం వెళ్తాను, తిరుపతి వెళ్తాను,

శబరిమల వెళ్తాను అంతేకానీ తనకు ఇతర దేవుళ్ళు తెలియదు అంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ నాకు దేవుడు కాదు అంటూ కామెంట్ చేశారు. దీంతో పవన్ తో బండ్ల గణేష్ కు రిలేషన్ మద్య గ్యాప్ వచ్చిందని, అందుకే బండ్ల గణేష్ ఈ విధంగా కామెంట్ చేశాడు అని ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ షోలో గబ్బర్ సింగ్ సినిమాకు మీకు పూర్తి రెమ్యూనరేషన్ అందిందా అని బాలకృష్ణ ప్రశ్నించగా…అతను అనుకున్నంత ఇచ్చాడని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు. ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.

ఈ క్రమంలో ఒక నెటిజన్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ…మీరు పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చారా ? అని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. ” ఈ జన్మకు లేదు. పవన్ కళ్యాణ్ నాకు దైవ సమానులు అని చెబుతూ..మరోసారి మాట మార్చాడు. ఇలా ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసే బండ్ల గణేష్ ఇలా మాట మార్చి పవన్ కళ్యాణ్ తనకి దేవుడితో సమానం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ని తెగ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus