Bandla Ganesh: ఇంటి ముందే గుండు గిసేసిన బండ్లగణేష్

Advertisement

కమెడియన్ గా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన బండ్ల గణేష్ ఆ తరువాత వ్యాపారులతో లాభాలు రావడంతో నిర్మాతగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య రాజకీయ నాయకుడిగా కూడా హడావుడి చేసి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ముఖ్యంగా బ్లేడ్ సీన్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రెండు సార్లు కరోనాతో ఫైట్ చేసి బౌన్స్ బ్యాక్ అయిన బండ్లన్న ఈసారి కొత్త అవతారం ఎత్తాడు.

కరోనా కారణంగా చాలా మంది సెలబ్రిటీలు బయటకు వెళ్లడం లేదు. ఇక ఇంట్లోనే ఉంటూ ఆ పని ఈ పని చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ అయితే తన తండ్రికి సేవ చేసుకుంటూ కనిపించాడు. బార్బర్ గా మారిపోయి ట్రిమ్మర్ తో గుండు గీసేశాడు. కరోనా ఎక్కువవుతున్న సమయంలో తండ్రిని బయటకు పంపకుండా తనే స్వయంగా హెయిర్ స్టైలిస్ట్ గా మారిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక బండ్ల గణేష్ నటుడిగా చివరగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక నిర్మాతగా 2015లో టెంపర్ అనంతరం మరో సినిమా చేయలేదు. కొన్ని సినిమాలను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయితే అనుకుంటున్నాడు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus