Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) తన మొదటి సినిమా ‘అల్లుడు శీను’ షూటింగ్ టైమ్లో చోటు చేసుకున్నా ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Bellamkonda Sai Sreenivas

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” ‘అల్లుడు శీను’ సినిమా షూటింగ్ టైమ్లో.. నేను ఎండలో కష్టపడి ఫైట్లు చేశాను. డ్యాన్స్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ ఆ టైమ్లో సెట్‌లో ఉన్న 200 మంది క్రూ మెంబర్స్ కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ సమంతతో రొమాంటిక్ సీన్ లేదా కిస్సింగ్ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ 200 మంది క్రూ మెంబర్స్ పనులన్నీ వదిలేసి మరీ అందరూ దగ్గరకి వచ్చేసేవారు.

నాకు డెబ్యూ మూవీ కావడం, పైగా అంతమంది గ్రూప్ గా నిలబడి చూస్తుండటంతో సమంతతో రొమాన్స్ చేయడానికి చాలా సిగ్గుగా అనిపించింది. అలాగే ఓ దశలో టెన్షన్‌ కూడా వచ్చేసింది. ఆ భయంతోనే నాకు చెమటలు కూడా పట్టేవి” అంటూ చెప్పుకొచ్చాడు.

2014 లో రిలీజ్ అయిన ‘అల్లుడు శీను’ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. తొలి సినిమాలోనే డాన్సులు, ఫైట్లు అద్బుతంగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు శ్రీనివాస్. డెబ్యూ హీరోల సినిమాల్లో కూడా ‘అల్లుడు శీను’ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus