పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే మాస్ ఎంటర్టైనర్ రూపొందింది. ‘గబ్బర్ సింగ్’ కాంబో కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 26న అంటే మరో 3 వారాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. అయితే ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే.. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి లాస్ట్ మినట్లో తప్పుకున్నాడట.
అవును… అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన సాంగ్స్ కంపోజింగ్ వర్క్ అంతా దేవి పూర్తిచేశాడు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.. చార్ట్ బస్టర్ అనిపించుకుంది. సెకండ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి వర్క్ తో సంతృప్తిగా లేకో.. లేదంటే దేవి శ్రీ ప్రసాద్ బిజీగా ఉండటం వల్లనో కానీ.. అతని ప్లేస్లోకి తమన్ ని తీసుకొచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది లేదు. కానీ ‘మైత్రి’ నిర్మాతలైన రవి శంకర్, నవీన్ ఎర్నెని..లతో దేవికి మనస్పర్దలు ఉన్న మాట నిజమే. ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో ఈ విషయం బయటపడింది. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యి దేవిని తప్పించే ప్రయత్నం చేశారు. ఆ టైమ్లో తమన్, అజనీష్ లోకనాథ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు.
కానీ సుకుమార్ మాత్రం దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ నే ఎక్కువగా తీసుకోవడం జరిగింది. జాతర ఫైట్ సీక్వెన్స్ కి మాత్రం అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా పుష్ప2 చెన్నై ఈవెంట్లో ఈ విషయం పై పరోక్షంగా స్పందించడం జరిగింది. ‘కుబేర’ సక్సెస్ మీట్లో కూడా ‘మైత్రి’ వారికి చురకలు అంటిస్తూ కామెంట్లు చేశాడు దేవి.