Bellamkonda Srinivas: సెంటిమెంట్‌తో బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్‌.. ఏం పేరంటే?

  • July 16, 2023 / 05:21 PM IST

సినిమాల్లో సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతుంటారు. సినిమా కాన్సెప్ట్‌, ప్రాజెక్ట్, నటీనటులు, టైటిల్‌.. ఇలా అన్నింటికి సెంటిమెంట్‌ను బాగా పట్టించుకుంటారు. దీనికి నటీనటులే కాదు, దర్శకులు కూడా అతీతం కాదు. అలా సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో అవుతూ… సినిమా టైటిల్‌ను రెడీ చేశారట దర్శకుడు రమేశ్‌ వర్మ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రమేశ్‌ వర్మ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్‌ దాదాపు ఫిక్స్‌ అయిపోయిందట.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా అంటే ‘రాక్ష‌సుడు’ అని చెప్పాలి. మాస్‌ సినిమాగా రూపొందిన ఆ సినిమా అదిరిపోయే విజయం అందుకుంది. కెరీర్‌ మంచి స్వింగ్‌లోకి వస్తుంది ఆ సినిమాతో అనుకున్నారంతా. అనుకున్నట్లే పక్కాగా ప్లాన్‌ చేసుకున్నా.. తేడా కొట్టేసింది. రీసెంట్‌గా ‘ఛత్రపతి’ హిందీ సినిమాతో వచ్చి ఇబ్బందిపడ్డాడు. ఈ సినిమా ఫలితం నుండి త్వరగా బయటపడాలని రమేశ్‌ వర్మ సినిమాను స్పీడప్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా పేరు దాదాపు ఓకే అయ్యింది అంటున్నారు.

రమేశ్‌ వర్మ సినిమా అంటే కచ్చితంగా ‘ఆర్‌’ అనే అక్షరంతోనే సినిమా టైటిల్‌ ఉంటుంది అని చెప్పొచ్చు. అలా ఇప్పుడు ఈ సినిమాకు ‘రుద్రాక్ష‌’ అనే టైటిల్ నిర్ణ‌యించిన‌ట్టు సమాచారం. రమేశ్‌ వర్మ సినిమా టైటిల్స్‌ ఇప్పటివరకు చూసుకుంటే… ‘రైడ్‌’, ‘రాక్ష‌సుడు’. ఇప్పుడు ఇదే స్టైల్‌లో ‘రుద్రాక్ష’ ఫిక్స్‌ చేశారట. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ఇదొక న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ అని అంటున్నారు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌గా రూపొందుతున్న సినిమా ఇది. రూ.65 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తార‌ని టాక్‌.

బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas ) ప్ర‌స్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ‘రాక్షసుడు’ లాంటి హిట్‌ సినిమా ఇచ్చిన ర‌మేష్ వ‌ర్మ‌పై న‌మ్మ‌కంతో ఈ ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట‌. ఆగ‌స్టులో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వస్తుందని సమాచారం. ఆ వెంటనే సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus