Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవల కావ్య రెడ్డితో అతని ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఆమె పెద్ద బిజినెస్మెన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే. చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Bellamkonda Srinivas

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్యనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో సంబరాలు అంబరాన్ని అంటాయి.ఇక నిన్న అనగా ఏప్రిల్ 29న రాత్రి 11: 05న సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి..ల వివాహం ఘనంగా జరిగింది.తిరుమలలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులతో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వంటి రాజకీయ రంగానికి చెందిన కుటుంబాలు కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య వివాహానికి హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కిష్కిందపురితో మంచి హిట్ అందుకున్న శ్రీనివాస్ .. త్వరలో టైసన్ నాయుడు తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే హైందవం సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే 2, 3 కొత్త స్క్రిప్టులు కూడా ఫైనల్ చేశాడు. వివాహం తర్వాత మిగిలిన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ..ల పెళ్లి ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

 

‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus