‘బేబీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్. ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనంద్ దేవరకొండ కూడా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ వైష్ణవికే ఎక్కువ మార్కులు పడ్డాయి.
‘బేబీ’ లో ఈ జంట చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంది. కాకపోతే ఆ సినిమాలో వీరి మధ్య ఎటువంటి రొమాంటిక్ ట్రాక్ లేకపోవడంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
సినిమా రిలీజ్ తర్వాత వైష్ణవి చైతన్యని ఎక్కువ మంది తిట్టుకోవడానికి.. ఆనంద్ తో రొమాంటిక్ ట్రాక్స్ లేకపోవడం వల్లనే అని చెప్పాలి. అయితే ఆ సినిమాలో మిస్ అయిన వీరి రొమాంటిక్ ట్రాక్స్ ‘ఎపిక్'(Epic) సినిమాలో సాధ్యమైనట్టు తెలుస్తుంది. ఈరోజు ‘ఎపిక్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో కామిడీతో పాటు యూత్ కి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవి- ఆనంద్..ల రొమాంటిక్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనే భరోసా ఇచ్చింది టీజర్.
ఇందులో ఎక్కువ శాతం లిప్ లాక్ సన్నివేశాలే హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. అలాగే ఇంటిమేట్ సీన్స్ కూడా లేకపోలేదు. టీజర్ లాంచ్ లో కూడా ఈ టాపిక్ పై హీరో ఆనంద్ దేవరకొండకి ప్రశ్న ఎదురైంది. అందుకు అతను స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇదిలా ఉండగా.. ‘ఎపిక్’ సినిమాకి ’90’s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ’90’s’ కి సీక్వెల్ గానే ఈ సినిమా రూపొందుతుంది.
‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?#epic #baby pic.twitter.com/4OvTSL3J0E
— Phani Kumar (@phanikumar2809) April 29, 2026