Bharateeyudu 2 OTT: ఆరోజు నుంచి ఓటీటీలో ఇండియన్2.. ఇక్కడైనా హిట్టవుతుందా?

  • August 1, 2024 / 06:15 PM IST

ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన సినిమాలలో ఇండియన్2 (Bharateeyudu 2)  సినిమా ముందువరసలో ఉంటుంది. శంకర్ (Shankar)  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో సంచలనాలు సృష్టిస్తాడని భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇండియన్2 సినిమాకు ఓటీటీ నుంచి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నారని వార్తలు వినిపించాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.

ఆగష్టు నెల 9వ తేదీ నుంచి ఇండియన్2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరిందని అందుకే ఆగష్టు 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఒకప్పుడు వరుస విజయాలతో ఒక వెలుగు వెలిగిన శంకర్ ఈ మధ్య కాలంలో పెద్దగా పస లేని స్క్రిప్ట్ లతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నారు. సుజాత రంగనాథన్ మరణం తర్వాతే శంకర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. శంకర్ సినిమాలు గ్రాండ్ గా ఉంటున్నా కథ, కథనం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించేలా లేకపోవడం గమనార్హం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా శంకర్ సైతం మారాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పస లేని కథనంతో సినిమాలు తీస్తే శంకర్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెగిటివ్ కామెంట్ల గురించి శంకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో శంకర్ కు పూర్వ వైభవం వస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. శంకర్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా కొన్ని సినిమాలకు శంకర్ పారితోషికంకు బదులుగా వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus