Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా?

రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనూసూద్ విలన్ గా నటించిన అరుంధతి (Arundhati) , దూకుడు (Dookudu) , కందిరీగ (Kandireega) , మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సోనూసూద్ కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాలను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పటికీ సోనూసూద్ తన సేవా కార్యకమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ రాజకీయాల్లో రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా సోనూసూద్ మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

అయితే సోనూసూద్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కోరిక మేరకు సోనూసూద్ విలన్ రోల్స్ కు కూడా నో చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సోనూసూద్ మొత్తం ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయలు అని సమాచారం. 2021 సమయానికి సోనూసూద్ ఆస్తుల విలువ 140 కోట్ల రూపాయలు కాగా గత మూడేళ్లలో ఆస్తుల విలువ కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే పెరిగిందని సమాచారం అందుతోంది.

సోనూసూద్ ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా ఆయనకు సొంతంగా కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయని సమాచారం. తన ఆదాయంలో కొంత మొత్తాన్ని సోనూసూద్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సోనూసూద్ మాత్రం సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారని సమాచారం అందుతోంది. ముంబైలో సోనూసూద్ కు లగ్జరీ అపార్ట్ మెంట్లు ఉన్నాయని తెలుస్తోంది.

సోనూసూద్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సోనూసూద్ తెలుగు ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఈ హీరో అభిమానులు కోరుకుంటున్నారు. సోనూసూద్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది. సోనూసూద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus