Bholaa Shankar Teaser: ‘భోళా శంకర్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • June 24, 2023 / 06:35 PM IST

ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి .. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ ‘క్రియేటివ్ కమర్షియల్స్’ సంస్థల పై అనిల్ సుంకర, కె.ఎస్.రామారావు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలు పాత్రలో నటిస్తుంది. ఆమెకు జోడీగా సుశాంత్ నటిస్తున్నాడు. మహతి సాగర్ సంగీత దర్శకుడు. ఆగస్టు 11 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొద్దిసేపటి క్రితం టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఒక నిమిషం 13 సెకన్ల నిడివి కలిగి ఉంది. టీజర్ మొత్తం చిరు మార్క్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో నింపేసాడు దర్శకుడు మెహర్. కలకత్తా బ్యాక్ డ్రాప్..

ఓ మాఫియా డాన్.. హీరోయిన్ తమన్నా, కీర్తి సురేష్, మురళీ శర్మ, గెటప్ శీను, శ్రీముఖి అలా మెరుపుల్లా కనిపించడం.. చిరు రౌడీలను రకరకాలుగా గాల్లోకి ఎగరేసి, నేలపై ఈడ్చేసి కొట్టడం.. ‘షికారుకి వచ్చిన షేర్ ని బే’ ‘ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… ఆల్ ఏరియాస్ అప్నా హై… నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు ..

పదకొండు ఆగస్టు దేక్ లేంగే’ అంటూ మాస్ డైలాగులు చెప్పడం. ఇలానే ఉంది టీజర్..! బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ పాత సినిమాలను తలపిస్తున్నాయి. అయితే చిరు మేకోవర్ మాత్రం చాలా బాగుంది. ఆయన ఏజ్ ఓ పదేళ్లు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం (Bholaa Shankar) టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus