హీరో యష్ కు.. అది అంత ఈజీ కాదేమో..?

Advertisement

2018 డిసెంబర్ 21న విడుదలైన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యి సంచలనాలు క్రియేట్ చేసింది. సౌత్ లో ‘బాహుబలి’ తరువాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ఇదే కావడం విశేషం. హీరో యష్ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ చిత్రం సీక్వెల్ అయిన ‘కె.జి.ఎఫ్2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సెకండ్ పార్ట్ ను అక్టోబర్లో విడుదల చెయ్యాలి అనుకుంటే.. వైరస్ మహమ్మారి వచ్చి బ్రేక్ వేసింది. దీంతో ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ప్రీమియర్ ను రేపు సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా లో టెలికాస్ట్ చెయ్యనున్నారు. భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. యష్ కూడా ఈ చిత్రాన్ని చూడామని వీడియోలు రిలీజ్ చేసి తెలుగులో కూడా ప్రమోట్ చేస్తుండడం విశేషం.

లాక్ డౌన్ వల్ల.. అందులోనూ సెలవు రోజున అందరూ ఇళ్లల్లోనే ఉంటారు కాబట్టి.. ‘కె.జి.ఎఫ్’ ను ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అయితే కె.జి.ఎఫ్ అభిమానులు మాత్రం ఈ లాక్ డౌన్ లో బ్లాక్ బస్టర్ టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసినమహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ నే బ్రేక్ చేస్తుంది అంటూ సవాలు విసురుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 23.4 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. ‘కె.జి.ఎఫ్’ చిత్రం అంత రేటింగ్ ను నమోదు చెయ్యడం సాధ్యమవుతుందా?

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus