బాలయ్య-బోయపాటి క్రేజీ కాంబినేషన్ పై సూపర్ న్యూస్!

  • June 9, 2020 / 10:02 AM IST

బాలయ్య ఫ్యాన్స్ కి నేడు పండుగే అని చెప్పొచ్చు. దానికి కారణం వారు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అప్డేట్ నేడు రానుంది. రేపు బాలయ్య పుట్టిన రోజు పురస్కరించుకొని, ఆయన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల కానుంది. దీనిపై ఇప్పటికే సమాచారం ఉండగా చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసే ఈ విషయం ధ్రువీకరించారు. నేడు సాయంత్రం 07:09 నిమిషాలకు ఈ బిగ్ అప్డేట్ రానుంది.

బాలయ్య బోయపాటిది హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం ఉంది. వాటిలో ఓ పాత్రలో ఆయన అఘోరాగా చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా చెప్పారు. ఇక ఆయన ఫ్యాన్స్ కన్విన్స్ అయ్యేలా ఓ అద్భుతమైన నేపథ్యంతో ఆయనను అఘోరాగా చూపించనున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి.

దీనితో హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రేపు బాలయ్య తన 60వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోనున్నారు.బాలయ్య షష్ఠి పూర్తికి కుటుంబ సభ్యులు, చిత్ర ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus