బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. మిగిలిన ఆరుగురులో లాస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, అరియానా, మోనాల్ ఈ ఇద్దరిమధ్యలోనే ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ‘ ఓపిక ‘ అనే టాస్క్ హౌస్ మేట్స్ అందరికీ కీలకం కానుంది. టాస్క్ పేరు మాత్రమే ఓపిక కానీ ఎవరికీ ఓపిక లేదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అరియానా మోనాల్ విషయంలో తప్పు చేసిందా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకి దారితీసింది. ఎక్కడ చూసినా అరియానాపై పోస్ట్ లు పెడుతున్నారు అందరూ.
దీంతో ఒక్కసారిగా అరియానా గ్రాఫ్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, మోనాల్ అరియానా అన్నమాటలకి బాగా డీప్ గా హర్ట్ అయ్యింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి తన బాధని బిగ్ బాస్ తో చెప్పుకుంది. అక్కడ సీన్ లో సోహైల్ లేడు. కేవలం హారిక మాత్రమే ఉంది. హారిక వచ్చి మోనాల్ ని ఓదార్చి కన్ఫెషన్ రూమ్ కి పంపించింది. ఇక్కడ అరియానా మోనాల్ ఏడుస్తుంటే అస్సలు పట్టించుకోలేదు. అందుకే అరియానాపై ఇప్పుడు ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.
గత కొన్నివారాలుగా ఉన్న ఓట్ బ్యాకింగ్ ఒక్కసారిగా షేక్ అవుతోంది. గతంలో తనకోసం తను బాగా ఫైట్ చేసినపుడు మోనాల్ కి విపరీతంగా ఓట్లు పడ్డాయి. అఖిల్ తో సమానంగా పోటీ పడి మరీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది మోనాల్. కానీ లక్కీగా ఆ వీక్ ఎలిమినేషన్ లో అవినాష్ బతికిపోయాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ మోనాల్ కి ఇలాగే రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా అరియానాకి ఎలిమినేషన్ గండం అనేది ఉంటుందనే బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అదీ మేటర్.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!