Bigg Boss 5 Telugu: ఈవారం ఆసక్తికరమైన పద్దతిలో నామినేషన్స్..!

  • October 18, 2021 / 10:48 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం నామినేషన్స్ అనేవి వేడెక్కిపోయాయి. ఆసక్తికరమైన పద్దతిలో ఒక డెన్ సెట్ ని ఏర్పాటుచేసి మరీ బిగ్ బాస్ ఈ నామినేషన్స్ ని పెట్టాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ టాస్క్ ఆడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక్కడే నామినేషన్స్ లో రచ్చ చోటుచేసుకుంది. ఒకరినొకరు నిందించుకుంటూ ఒక రేంజ్ లో నామినేట్ చేసుకున్నారు. ఇక ఈవారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఇందులో లోబో ఆల్రెడీ సీక్రెట్ రూమ్ లో ఉండి నేరుగా నామినేట్ అయ్యాడు కాబట్టి, ఈవారం లిస్ట్ లో ముందు ఉన్నాడు. ఇక టాస్క్ లో పార్టిసిపేట్ అయినవాళ్లులో అనీమాస్టర్, సిరి, ప్రియ, కాజల్, జెస్సీలు నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఇక్కడే జేస్సీ ఇంకా సిరిలు వీరలెవల్లో ఆర్గ్యూమెంట్స్ పెట్టుకున్నారట. జెస్సీ, సిరి, షణ్ముక్ ముగ్గురి మద్యలో కూడా పోటీ వచ్చిందని చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఆరుగురు నామినేషన్స్ లో ఉండటం అనేది మంచి కిక్ ఇస్తోంది. ఈవారం ఎవరు వీరిలో ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

[yop_poll id=”3″]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus