Priyanka Jain: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ ప్రియాంక?

  • December 19, 2023 / 01:43 PM IST

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో సీరియల్ నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె సీరియల్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూడా ఈమె ఫిజికల్ టాస్కులలో తన వంతు కృషి చేశారు. అయితే ఎక్కువగా వంటగదిలోనే ఉండడంతో ఈమెకు వంటలక్క అనే ట్యాగ్ కూడా వేశారు. అదే తనకు మైనస్ గా మారింది. ఇక సీరియల్ బ్యాచ్ అందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి గ్రూప్ గేమ్ కూడా ఆడారన్న విషయంపై నాగార్జున ప్రియాంకకు క్లాస్ కూడా తీసుకున్నారు.

ఇలా తన వంతు కృషి చేస్తూ అన్ని టాస్కులలో ముందుకు కొనసాగుతూ ఎంతో మంచి ఆట తీరును కనబరిచినటువంటి ప్రియాంక ఫినాలే వరకు చేరుకున్నారు. అయితే టైటిల్ రేస్ లో మాత్రం ప్రియాంక లేరని చెప్పాలి తనకంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటంతో ఈమె టైటిల్ రేసులో లేరు. ఇకపోతే ప్రియాంక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున ఒక వార్త వైరల్ గా మారింది.

ఈమె సీరియల్ నటుడు శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే. ఫ్యామిలీ వీకెండ్ లో భాగంగా శివకుమార్ తన కోసం హౌస్ లోకి వెళ్లారు. ఆ సమయంలోనే ఈయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ హామీ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ పూర్తి కాగా త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.

బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ దాదాపు 37 లక్షల రూపాయలు గెలుచుకున్నటువంటి (Priyanka Jain) ప్రియాంక ఆ డబ్బుతో ఎంతో ఘనంగా తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నారని త్వరలోనే వీరి పెళ్లి గురించి ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ తర్వాత ప్రియాంక కెరియర్ ఎలా మలుపు తిరగబోతుందో తెలియాల్సి ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus