‘పటాస్’, ‘జబర్దస్త్’ కామెడీ షోలతో బుల్లితెరపై నిలదొక్కుకుంది ఫైమా(Faima Shiek). అనతి కాలంలోనే తన కామెడీ టైమింగ్ తో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో తన గేమ్ తో, ఆటిట్యూడ్ తో ఫైమా మంచి మార్కులు వేయించుకుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేదు.స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఫైమా స్టార్ గా రాణిస్తోంది అనడంలో సందేహం లేదు.
ఫైమా పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. పేదింటి కుటుంబానికి చెందిన అమ్మాయి… అయినప్పటికీ తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకుంది. వ్యక్తిగత జీవితంలో.. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ఫైమా లవ్ స్టోరీ కూడా చాలా మందికి తెలిసిందే. వాటి వల్ల ఎదుర్కొన్న విమర్శల సంగతి కూడా అందరికీ తెలిసిందే. గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో ఫైమా మోసం చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ ముగ్గురిలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకడు.
ఫైమా- ప్రవీణ్..ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఓ సందర్భంలో స్టేజ్ పైనే ప్రవీణ్ ఫైమాకి ప్రపోజ్ చేయడం, అందుకు ఆమె అంగీకారం తెలుపడం జరిగింది. కానీ బిగ్ బాస్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఫైమా- ప్రవీణ్..ల బంధం బీటలు వారింది. తర్వాత పర్సనల్ రీజన్స్ కారణంగానే విడిపోయామని ఫైమా వివరణ ఇచ్చినా, అటు తర్వాత ఆమె దారుణంగా మోసం చేసిందని ప్రవీణ్ కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ వివాదాల తర్వాత ప్రవీణ్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఫైమా కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 9 యేళ్ళుగా తనతో రహస్య ప్రేమాయణం సాగిస్తున్న ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని ఫైమా పెళ్లిచేసుకుంది. మొదట రెజిస్టర్ ఆఫీస్లో వీరు పెళ్లి చేసుకోగా.. తర్వాత హిందూ సాంప్రదాయ పద్దతిలో కూడా వివాహం చేసుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.