Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. అందులో యాంకర్ అనుపమ చోప్రా అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి మరింత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇందులో ‘వారణాసి'(Varanasi) ప్రస్తావన కూడా చర్చల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గురించి చాలా విషయాలు పంచుకున్నాడు పృథ్వీరాజ్.ఇందులో భాగంగా ‘వారణాసి’ గురించి రాజమౌళి పనితనం గురించి చెప్పి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

Varanasi

‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు హీరోగా కాగా ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతుంది’వారాణసి’. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్ర పోషిస్తుండగా, పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా.. ఓ సన్నివేశం కోసం రాజమౌళి ఏకంగా 90 టేకుల పైగా తీసుకున్నాడంటూ పృథ్వీరాజ్ చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ” ‘వారణాసి’ షూటింగ్లో ఒకరోజు ఒక సీన్ ను ఉదయం మొదలుపెట్టి సాయంత్రం 6:30 – 7 గంటల వరకు తీశారు రాజమౌళి. అయినప్పటికీ రాజమౌళి సంతృప్తి చెందలేదు. నెక్స్ట్ డే మళ్ళీ సీన్ తీద్దామని ప్యాకప్ చెప్పే టైమ్లో చెప్పారు. దీంతో నేను మహేష్ దీని గురించి సరదాగా డిస్కస్ చేసుకుని నవ్వుకున్నాం. రాజమౌళి గారి పనితనం, పర్ఫెక్షన్ ఆ రేంజ్లో ఉంటాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం” అని చెప్పుకొచ్చాడు.

యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus