Neha Chowdary: గ్రాండ్‌గా యాంకర్ నేహా చౌదరి హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

తెలుగులో పలు టీవీ షోలతో పాటు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కి కూడా యాంకరింగ్ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది నేహా చౌదరి.. బిగ్ బాస్ హౌస్‌కి కూడా వెళ్లొచ్చింది. అప్పటినుండి మరింత పాపులర్ అయింది.. మా అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది అని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే చెప్పింది.. అప్పటినుండి వీలు కుదిరినప్పుడల్లా నేహా పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదని కొద్ది రోజుల కిందట స్వయంగా నేహానే పెళ్లి మేటర్ రివీల్ చేసింది.

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వివరాలు చెప్పుకొచ్చింది. త్వరలో అనిల్ అనే వ్యక్తితో ఏడడుగులు వేయబోతోంది. రీసెంట్‌గా నేహా హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పెషల్‌గా డిజైన్ చేసిన ఎల్లో శారీలో మెరిసిపోయింది నేహా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు నేహా చౌదరి, అనిల్ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వీరు పెళ్లి పీటలెక్కనున్నారు.


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus