Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Advertisement

‘బిగ్‌బాస్’ సీజన్ 5తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు విశ్వ. ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అయిన అతను, ప్రస్తుతం సొంతంగా ఓ ఫిట్‌నెస్ క్లబ్ (జిమ్) కూడా రన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వ.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులతో పాటు తన భార్య బరువుపై వస్తున్న ట్రోల్స్‌ పై కూడా స్పందించి షాకింగ్ విషయాలు తెలిపారు. పదో తరగతి పూర్తవ్వగానే.. అంటే దాదాపు 24 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు విశ్వ తెలిపాడు. ‘విద్యార్థి’, ‘పెళ్లికోసం’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత సీరియల్స్‌కి షిఫ్ట్ అయ్యాడట. అయితే కొంతకాలం తనకు అవకాశాలు రాకుండా కావాలనే కొందరు ఇండస్ట్రీలో తొక్కేశారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

Bigg Boss Vishwa

ఆ గ్యాప్‌లో తన తమ్ముడి సంపాదన మీదే బతికానని, తర్వాత బిజినెస్‌లో నష్టాలు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా రన్ చేసినట్టు తెలిపి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ కష్టాలన్నీ దాటి ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. “నా భార్య శ్రద్ధతో నా పెళ్లి విచిత్రంగా జరిగింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) టైమ్‌లో ఆమె నన్ను చూసి ఇష్టపడింది. అయితే అప్పటికే నేను బ్రేకప్ బాధలో ఉన్నాను.

ఆమె మెసేజ్ చేసినప్పుడు కేవలం టైమ్‌పాస్ చేద్దామని నంబర్ ఇచ్చాను, కానీ వారం తిరిగేసరికి ఆమె క్యారెక్టర్‌కు ఫుల్లుగా కనెక్ట్ అయిపోయాను. చివరికి ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము.మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా.. ‘ముందు నీ పెళ్లాన్ని సన్నబడమను.. తర్వాత వేరేవాళ్లకి ఫిట్‌నెస్ నీతులు చెప్పొచ్చు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ, ఆమె బరువు వెనుక ఉన్న చేదు నిజం నెటిజన్లకు తెలియదు.

రెండో బాబు పుట్టిన తర్వాత హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఆమె బరువు పెరిగిపోయింది. తగ్గడం కోసం వర్కౌట్లు కూడా స్టార్ట్ చేశాను. అనుకోకుండా ఆమెకు ‘కార్పెల్ టన్నెల్’ (Carpal Tunnel) అనే రేర్ డిసీజ్ వచ్చింది. ఆ వ్యాధి వల్ల చేతుల్లో బలం పోయింది, కనీసం పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టుకోలేని పరిస్థితి రావడంతో వర్కౌట్స్ ఆపేసింది. ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ కోలుకుని ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేసిందని, ఆమెను దేవుడు పంపిన ఏంజెల్‌గా భావిస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు విశ్వ.

‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus