Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Advertisement

టాలీవుడ్‌లో విభిన్నమైన కాన్సెప్ట్స్, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్ రవిబాబు (Ravi Babu). చాలా గ్యాప్ తర్వాత ఆయన ‘రేజర్’ అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయనే డైరెక్ట్ చేస్తూ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ మూవీ.. మే 8న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయాడు రవిబాబు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ ఫిల్మ్ మేకింగ్‌పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Ravi Babu

గతంలో సినిమా తీసే పద్ధతికి, ఇప్పటి ట్రెండ్‌కు మధ్య ఉన్న తేడాను ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. “ఒకప్పుడు మేకర్స్ ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే.. అప్పట్లో ఫిల్మ్ రోల్స్ వాడేవాళ్లు కాబట్టి దాని మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. ఆ ఫిల్మ్ చాలా కాస్ట్లీ కావడంతో డైరెక్టర్స్, యాక్టర్స్, కెమెరామెన్ అందరూ చాలా అలర్ట్‌గా ఉంటూ ఎవరి పని వాళ్లు పర్ఫెక్ట్‌గా చేసేవాళ్లు.కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగం అయిపోవడంతో ఆ భయం, డిసిప్లిన్ పోయాయి.

ఒక మెమరీ చిప్ వేయడం, షూట్ చేయడం.. మళ్లీ దాన్ని చెరిపేసి వాడటం చేస్తున్నారు. అసలు దాని కాస్ట్ కూడా లెక్కేయలేకపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. బేసిక్ టెక్నాలజీతో పాటు టైమ్‌కు, డబ్బుకు విలువ ఇవ్వడం తగ్గిపోయింది” అంటూ కామెంట్స్ చేశారు. రవిబాబు ఆవేదన కరెక్టే కావచ్చు… కానీ ఆయన వాడిన ‘ఒళ్లు బలిసి’ అనే పదంపై మాత్రం నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. టెక్నీషియన్లను ఉద్దేశించి అలాంటి పదజాలం వాడటం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన చెప్పిన దాంట్లో వందశాతం నిజం ఉందంటూ సమర్థిస్తున్నారు. ఏదేమైనా రవిబాబు కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus