బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. చాలామంది కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా చెప్పేస్తున్నారు. ఈ టైమ్ లో అసలు బిగ్ బాస్ సీజన్ 5ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. మ్యాగ్జిమమ్ షోని సెప్టెంబర్ 5వ తేదిన ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి షోలో చాలామంది సెలబ్రిటీలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అయితే ఫైనల్ లిస్ట్ అనేది కన్ఫార్మ్ కాలేదు. అంతేకాదు, ఒక్క పార్టిసిపెంట్ కూడా కన్ఫార్మ్ చేయలేదు. కేవలం వాళ్లతో సంప్రదింపులు మాత్రమే జరిపారు. జులై మొదటివారంలో వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈసారి అబ్బాయిలకంటే కూడా అమ్మాయిలే ఎక్కువమంది ఉంటారని అంటున్నారు.
గ్లామర్ డోస్ పెంచేందుకే సీజన్ 5లో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ని సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. యంకర్స్, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్, సోషల్ మీడియా ఫేమ్, యూట్యూబ్ ఫేమ్, టిక్ టాక్ ఫేమ్ ఇలా ఒక్కో కేటగిరినుంచీ ఒక్కొక్కరిని తీసుకునే బిగ్ బాస్ టీమ్, ఈసారి ఆచితూచి పార్టిసిపెంట్స్ ని సెలక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 50మందికి పైగా పార్టిసిపెంట్స్ ని సెలక్ట్ చేశారు. కానీ ఒక్కరిని కూడా ఫైనల్ చేయలేదు. సోషల్ మీడియాలో, రకరకాలా యూట్యూబ్స్ లో వస్తున్న లిస్ట్ , వినిపిస్తున్న పేర్లు కేవలం గెస్సింగ్ మాత్రమే.
బిగ్ బాస్ సీజన్ 5 స్పాన్సర్స్ ఎప్పుడైతే కన్ఫార్మ్ అవుతారో, ఆ బడ్జెట్ ని బట్టీ సెలబ్రిటీలని కన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈసారి తమిళం నుంచీ ఇద్దరిని షోలో తీస్కుంటారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం సిక్స్ సెన్స్ షో నడుస్తోంది కాబట్టి, ఈ షో అయిపోయిన తర్వాతే బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?Akkineni, Akkineni Nagarjuna,