కరోనా బారిన పడిన ప్రముఖ సీరియల్ హీరో!

  • July 4, 2020 / 09:16 AM IST

నటులపై కరోనా పంజా విసురుతుంది. ముఖ్యంగా ఇటీవల షూటింగ్స్ లో పాల్గొన్న నటులు దీని బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ కి కరోనా సోకగా చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇక సీరియల్స్ నటులు ప్రభాకర్, హరి కృష్ణ మరియు నవ్య స్వామిలకు కరోనా సోకడం జరిగింది. వీరు షూటింగ్స్ లో పాల్గొనడం వలన కరోనా అంటుకుంది. కరోనా వైరస్ బారిన మరో నటుడు పడ్డాడు. అనేక సీరియల్స్ లో హీరోగా నటించిన రవి కృష్ణ కు కరోనా వైరస్ సోకింది.

ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీనితో ఆయన్ని క్వారంటైన్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల కొన్ని సీరియల్స్ షూటింగ్స్ లో ఆయన పాల్గొన్న నేపథ్యంలో కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన్ని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.రవి కృష్ణ బిగ్ బాస్ 3 లో పాల్గొని మంచి పోటీ ఇచ్చారు.

హైదరాబాద్ లో కరోనా విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా షూటింగ్స్ పూర్తిగా ఆపివేశారు. ఇక పెద్ద చిత్రాల షూటింగ్స్ అనుమతుల తరువాత కూడా తిరిగి మొదలుపెట్టలేదు. స్టార్ హీరోలైతే షూటింగ్స్ కి ససేమిరా అంటున్నారు. కరోనా వ్యాప్తి ఇలానే కొనసాగే పక్షంలో షూటింగ్స్ వచ్చే ఏడాది వరకు మొదలుకాకపోవచ్చు.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus