Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షో తెలుగు సీజన్8 మొదలయ్యేది అప్పుడేనా?

  • April 6, 2024 / 06:21 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఆ షో నిర్వాహకులకు మంచి లాభాలను ఆ షో కంటెస్టెంట్లకు సైతం ఊహించని స్థాయిలో పేరు వచ్చింది. ఈ షో గ్రాండ్ ఫినాలే రోజున నిర్వాహకులపై, పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) పై కేసులు నమోదు కాగా ఆ కేసులు సైతం పరిష్కారం అయ్యాయని సమాచారం అందుతోంది. మరోవైపు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ షో సీజన్8 కు కూడా నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించనున్నారని హోస్ట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భోగట్టా. సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి బిగ్ బాస్ షో సీజన్8 మొదలు కానుంది. అయితే ఈ నెలాఖరు నుంచి బిగ్ బాస్ షో కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలుకానుందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో సీజన్7 రేటింగ్స్ పరంగా అదరగొట్టింది.

బిగ్ బాస్ షో సీజన్8 ను కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ఎంతో కష్టపడుతోందని తెలుస్తోంది. బిగ్ బాస్ షో తెలుగు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే నాగార్జున సైతం హోస్టింగ్ విషయంలో కొంత మారారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ కు ఈ షోకు భారీ రేంజ్ లో పారితోషికం దక్కుతోంది.

బిగ్ బాస్ షో సీజన్8 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కుమారి ఆంటీ పేరుతో పాటు మరి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ 8 కు సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో బిగ్ బాస్ షో ప్రసారం కానుందని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus