Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

నాని- సుజిత్ కాంబినేషన్లో ‘బ్లడీ రోమియో'(Bloody Romeo) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు నాని పుట్టినరోజు కావడంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు.

Bloody Romeo

ముందుగా ఓ ‘గ్యాంగ్స్టర్ డెన్’ ని చూపించారు. అందులో అగ్నిప్రమాదం జరగడం చాలా మంది రౌడీలు, దాదాలు మరణించడం జరుగుతుంది. దాన్ని ఒక వ్యక్తి(వెన్నెల కిషోర్) వాయిస్ లో మరో వ్యక్తికి వర్ణించడాన్ని ఇందులో చూపించారు.  ‘ఎలా జరిగింది? షూటింగా?’ అంటూ ఓ వ్యక్తి పలుకగా.. కాదు కుకింగ్ అంటూ మరో వ్యక్తి హీరో చేసిన విధ్వంసాన్ని వర్ణించాడు.

రివాల్వర్ లో బుల్లెట్లు తిరుగుతున్నప్పుడు కుకింగ్ రూమ్లో వంట పదార్ధాలు అదే షేప్లో కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి. అటు తర్వాత ‘ఏంటి ఆ రెసిపీ’ అని అదే వ్యక్తి ప్రశ్నించగా అందుకు వెన్నెల కిశోర్.. “చిటికెడు కరుణ.. పిడికెడు కోపం, బారెడు భీభత్సం, సరిపోయేంత .. చ చ సారీ మతిపోయేంత ప్రేమ.. అంటూ ఆ పదార్ధాలన్నీ కుక్కర్లో వేసి విజిల్ ప్లేస్ లో బాంబ్ పెట్టి హీరో బయటకి రావడం.. తర్వాత అది పేలిపోయి గ్యాంగ్స్టర్స్ అంతా చనిపోవడం వంటివి చూపించారు.

చివర్లో ‘ఇలాంటి వంట మిగలదు, మనిషి కూడా బ్రతకడు’ అంటూ ఒకరు పలుకగా… మరొకరు ‘కానీ ఒక్కడు మిగిలాడు’ అన్నప్పుడు హీరో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఈ అనౌన్స్మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కొత్తగా ఏమీ లేదు. ‘విక్రమ్’ అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే స్టయిల్లో ఉంటుంది. కాకపోతే ఈ ‘బ్లడీ రోమియో’ వీడియో మొత్తాన్ని ఏఐతో తీయడం విశేషం.

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus