గతంలో ఫ్లాప్ అయినా, లేదంటే సరిగ్గా ఆడని కొన్ని సినిమాలని 4Kకి డిజిటలైజ్ చేసి రీ- రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు లేదంటే ఆ పర్టిక్యులర్ సినిమాని ఇష్టపడే వాళ్ళు మళ్ళీ ధియేటర్లకి వెళ్ళి.. ఆ సినిమాలని వీక్షించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ‘ఆరెంజ్’ సినిమాని రీ- రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు.అది ఫ్లాప్ సినిమా అయినప్పటికీ 3 సార్లు రీ- రిలీజ్ అయ్యింది. 3 సార్లు కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
పవన్ కళ్యాణ్, మహేష్ వంటి వాళ్ళ రీ- రిలీజ్ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ‘సలార్’ వంటి సినిమాలు రీ- రిలీజ్ అవ్వగా.. వాటికి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ‘సలార్’ సినిమాని ప్రతి 2,3 నెలలకి ఒకసారి రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రీ-రిలీజ్ సినిమాల హవా తగ్గిందేమో అనిపిస్తుంది.
ఇటీవల ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అవి కల్ట్ క్లాసిక్ సినిమాలు. బుల్లితెరపై ఇప్పటికీ రికార్డులు కొడుతూనే ఉన్నాయి. అయితే రీ- రిలీజ్లో ఎందుకో వాటికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. మరోవైపు మహేష్ ‘అతడు’ సినిమాని ఈ ఫిబ్రవరి 28న మళ్ళీ రీ- రిలీజ్ చేస్తున్నారు. కానీ దానిపై ఫ్యాన్స్ సైతం ఆసక్తి చూపడం లేదు.
ప్రభాస్ ‘మున్నా'(Munna) సినిమాని కూడా మార్చి 6న రీ-రిలీజ్ చేస్తున్నారు. దాని విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.