కారు అంటే కేవలం వాహనం మాత్రమే కాదు. అది సక్సెస్‌కి, హోదాకి కూడా సంకేతం. అందుకే, చాలా మంది జీవితంలో మంచి కారును కొనుక్కోవాలని కలలు కంటూ వుంటారు. అయితే ఇది కొందరికీ మాత్రమే నిజమవుతూ వుంటుంది. కానీ మారిన కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా కారు లోన్ల సౌలభ్యం రావడంతో ఇప్పుడు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం కారును కొనుగోలు చేసేందుకు సాయం చేస్తున్నాయి.
ఇకపోతే మార్కెట్లలోకి ఏ కొత్త మోడల్ కారు వచ్చినా కొనేసి గ్యారేజ్‌లో పెట్టేసే స్టార్లు, క్రీడాకారులు, సెలబ్రెటీలు మనదేశంలో ఎందరో వున్నారు. అలాంటి వారిలో ధర్మేంద్ర ఒకరు ఆయన కూడా ఓ కారు కొన్నారు దాని ధర ఎంతో తెలుసా.. రూ.18000. ఏంటీ జోక్ చేస్తున్నామని అనుకుంటున్నారా. దశాబ్దాల పాటూ హిందీ సినిమా రంగాన్ని ఏలిన ‘హీ-మ్యాన్’ తాజాగా తన అలనాటి కారుని నెటిజన్స్ ముందుకు తీసుకొచ్చారు.ధర్మేంద్ర తన కెరీర్లో కొన్న తొలి కారు… బ్లాక్ ఫియట్.
ఆరోజుల్లో దాని ధర 18 వేలట. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. అందుకే ఈ కార్ని తాను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పారు ధర్మేంద్ర. తన తొలి కారుకి నా గుండెలో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన టేజ్ కార్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది…
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు