Devara: దేవర విషయంలో బాలీవుడ్ మీడియా విషం కక్కడానికి కారణాలివే?

నందమూరి అభిమానులు ఈ ఏడాది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవర ఒకటి. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో, అద్భుతమైన కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2024 బిగ్గెస్ట్ హిట్లలో దేవర కచ్చితంగా స్థానం సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం. మెజారిటీ భాషలలో తారక్ ఓన్ వాయిస్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది.

కొరటాల శివ ఈ సినిమా కొరకు మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారని టీజర్, ట్రైలర్ విడుదలైతే కథ గురించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దేవర రిలీజ్ డేట్ మారడంపై బాలీవుడ్ మీడియా విషం కక్కుతోంది. బాలీవుడ్ సినిమాలకు భయపడి దేవర సినిమాను వాయిదా వేస్తున్నారని నెగిటివ్ కథనాలను అక్కడి మీడియా వండివారుస్తోంది.

సలార్ మూవీ వల్ల డంకీ సినిమా కలెక్షన్ల విషయంలో ఊహించని స్థాయిలో నష్టపోవడంతో బాలీవుడ్ మీడియా ఈ ప్రచారం దిశగా అడుగులు వేస్తోందని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రిలీజ్ డేట్ ను మార్చుకుందని అధికారికంగా ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దేవర సినిమా సమయానికి మరికొన్ని సినిమాలు షెడ్యూల్ అవుతుండటం తారక్ ఫ్యాన్స్ ను గందరగోళానికి గురి చేస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేదా దేవర టీమ్ స్పందిస్తే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా దేవర రిలీజ్ డేట్ మారితే ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. దేవర (Devara) సినిమా రిలీజ్ డేట్ ఇతర సినిమాల రిలీజ్ డేట్లను ప్రభావితం చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus