OG Movie: బాలీవుడ్ లో ఓజీకి ఇక తిరుగులేదా!

గత రెండు రోజుల నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ రేంజ్ లో వేడెక్కాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చెయ్యడం, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు మంగళగిరి కి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకోవడం, దానికి ఆయన నడిరోడ్డు మీద నిరసన తెలియచేయడం, మొత్తం ఇవే కనిపిస్తున్నాయి సోషల్ మీడియా లో.

ఇక నిన్న రాష్ట్రం లో జరిగిన సంఘటనలపై ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్, కొన్ని అంశాలను టచ్ చేసి మాట్లాడడం తెగ వైరల్ గా మారింది. అందులో ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు ఆయన తనయుడి ఆర్యన్ గురించి మాట్లాడిన కొన్ని మాటలకు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ని అప్పట్లో డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేసారు. అతను అమాయకుడు అని ఆరోజు నేను ఇదే పార్టీ కార్యక్రమం లో చెప్పాను, నెల రోజులు కస్టడీ లో పెట్టుకొని అతను మాలిక ద్రవ్యాలు సేవించలేదని చివరికి పోలీసులు అతనిని వదిలేసారు. ఏ తప్పు చెయ్యకుండా అతను నెల రోజులు జైలు లో ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా అంటూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉదహరిస్తూ ఈ అంశాన్ని గుర్తు చేసాడు పవన్ కళ్యాణ్.

దీనికి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. న్యాయం వైపు నిలబడి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు, మీ ఓజీ సినిమా టీజర్ ని చూసాము , అదిరిపోయింది, ఆ చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము, కచ్చితంగా బాలీవుడ్ లో ఈ సినిమాని (OG Movie) మేము చూస్తాము, భారీ బ్లాక్ బస్టర్ ని చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus