Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హోస్ట్‌గా ఓ టాక్‌ షో త్వరలో రానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగావర్స్‌ అనే పేరు పెట్టారని మీరు చదివే ఉంటారు. అయితే ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తయిందట. మెగావర్స్‌ అంటే మెగా లోకం అని అర్థం. దానికి తగ్గ అద్భుతమైన సెట్‌ను నిర్మించారట ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల టీమ్‌. ఎందుకంటే ఈ షోకి నిర్మాత ఆమెనే. ఇక ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుందనే విషయం కూడా తెలిసిందట.

Megaverse

మామూలుగా అయితే ఒక షోను అగ్ర హీరో లేదంటే.. స్నేహితులతో చిత్రీకరిస్తుంటారు ఇలాంటి టాక్‌షోల నిర్వాహకులు. అయితే మెగా వర్స్‌ టీమ్‌ కొత్తగా ఆలోచించింది అని చెబుతున్నారు. తొలి ఎపిసోడ్‌ను నవ్వులతో స్టార్ట్‌ చేయాలని మూడు తరాల కమెడియన్స్‌న తీసుకొచ్చారట. వారే బ్రహ్మానందం, సునీల్, సత్య. ఈ ముగ్గురూ వారి వారి తరాల్లో కామెడీలో టాప్‌లో నిలిచారు. ఈ ముగ్గురితోనూ చిరంజీవి నటించారు. అందుకే ఈ కాంబో సెట్‌ చేశారు అంటున్నారు.

స్టార్‌ హీరోల టాక్‌ షోకి ‘అన్‌స్టాపబుల్‌’ ఓ బెంచ్‌ మార్క్‌గా నిలవడంతో చిరు షో ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుండటంతో మేకింగ్‌, క్వాలిటీ, గ్రాండియర్, రీచ్‌ విషయంలో ఎలాంటి ఆలోచనా అక్కర్లేదు. అందుకే ఈ షో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ముగ్గురూ ఇప్పుడు గెస్ట్‌లు అని తేలడంతో.. ఆ తర్వాత ఎవరు వస్తారనే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా.. మొత్తం ఇండియన్‌ సినిమా నుండి గెస్టులను తెస్తున్నారట.

అయితే కేవలం సినిమా వాళ్లే కాకుండా.. ఇతర రంగాల్లోని ముఖ్యులు కూడా గెస్టులుగా వస్తారట. మరి వారితో చిరంజీవి ఎలా సందడి చేస్తారనేది చూడాలి. త్వరలో ఈ షో లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తారని సమాచారం. అప్పుడు ఇంకొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి ఇన్నేళ్ల అనుభవం ఆ షోలో కనిపిస్తుంది.

పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus