Buchi Babu Sana: ఓ ‘ఇంటి’వాడైన ‘పెద్ది’ డైరక్టర్‌.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

యువ దర్శకుడు, ‘పెద్ది’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టి అగ్ర దర్శకుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న బుచ్చిబాబు సానా ఓ ‘ఇంటి’ వాడయ్యారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైష్ణవ తేజ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ సినిమాతో కెరీర్‌ ప్రారంభంచిన ఆయన.. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ ఇల్లు కట్టుకుని తన ఇంట్లో దిగారు. ఆయన సొంతూరు పిఠాపురంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.

Buchi Babu Sana

పిఠాపురంలో తన కలల ఇంటిని కట్టుకున్న బుచ్చిబాబు సానా శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం. ఈ గృహప్రవేశం ఉండడం వల్లే ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కన్సర్ట్‌కు బుచ్చిబాబు హాజరు కాలేకపోయారని భోగట్టా. అంతకు ముందు స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించినట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక బుచ్చిబాబు సానా జీవితంలో ఈ వారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఆయన కోరుకున్న అడుగు ఇలా పడింది. మరోవైపు ‘పెద్ది’ సినిమాలో మొదటి పాట ‘చికిరి చికిరి..’కి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ – జాన్వీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉత్తరాంధ్రలోని ఓ కొండ ప్రాంతంలో సరదాగా విలేజ్‌ క్రికెట్‌ ఆడుకుంటూ జీవించే పెద్ది అనే కుర్రాడికి హీరోయిన్‌ ఎదుట పడుతుంది. ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి? దాని కోసం అతడు చేసిన సాహసాలేంటి? ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ అని చెబుతున్నారు.

శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus