‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన హిట్ కిక్‌తో వరుసగా సినిమా కథలు ఓకే చేసుకుంటూ వస్తున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ తర్వాత ఏయే సినిమాలు చేస్తాడు అనే విషయంలో చూచాయగా సమాచారం ఉంది. లెక్క ప్రకారం అయితే ‘ఐకాన్’ చేయాలి. కానీ ‘పుష్ప’ రెండు భాగాలు అవ్వడంతో మొత్తం పరిస్థితి మారిపోయిందా. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతేకాదు బన్నీ స్నేహితుడు బన్ని వాస్ కూడా ఇదే మాట చెబుతున్నారు. బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి?.. ఈ ప్రశ్న అభిమానులు, ప్రేక్షకుల్లో చాలా రోజుల నుండి ఉంది.
ఎందుకంటే ‘పుష్ప’ మొదటి పార్ట్ తర్వాత బన్నీ మరో సినిమా చేసి… తర్వాత ‘పుష్ప’ పార్ట్ 2కి వస్తాడని చెప్పారు. దీనిపై తర్వాత రకరకాల పుకార్లు వచ్చినా… ఎందులోనూ క్లారిటీ లేదు. తాజాగా బన్ని వాస్ ఓ ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పుకొచ్చాడు. దీంతో అల్లు అర్జున్ సినిమా లైనప్ కన్‌ఫ్యూజన్‌లో ఉందని తెలుస్తోంది. ‘‘పుష్ప’ మొదటి భాగం పూర్తయితే తప్ప బన్నీ సినిమా లైనప్‌పై స్పష్టత రాదనిపిస్తోంది. గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం.
అలాగే చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న మురుగదాస్ సినిమా ఉంది. ఇక ఎప్పడో అనౌన్స్ చేసిన వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ ఉంది. మరి వీటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం అని బన్ని వాస్ చెప్పాడు. వై ‘బన్ని’ వాస్ ఇంత కన్‌ఫ్యూజన్.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు