ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాల్లో ఎప్పుడూ కిడ్స్ రోల్స్ కీలకంగా ఉంటాయి. విక్టరీ వెంకటేష్ సినిమాల్లో అయితే మరీనూ.! ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పెళ్ళిచేసుకుందాం’ ‘తులసి’ వంటి సినిమాల నుండి చూసుకుంటే మొన్నమధ్య వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వరకు చైల్డ్ ఆర్టిస్టుల రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లిరాజు పాత్ర ఏ రేంజ్‌లో హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో అతను(రేవంత్) బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.
ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47) సినిమాలో నటిస్తున్న ప్రజ్వల్ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే చర్చ మొదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన సినిమా ఇది. ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌లో ప్రజ్వల్ పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ట్రైలర్‌లో మాత్రం ఈ పాత్రను హైలైట్ చేయలేదు. కానీ, మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో మాత్రం తన స్పీచ్‌తో అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకున్నాడు ప్రజ్వల్.
ఏకంగా త్రివిక్రమ్ స్పీచ్‌నే డామినేట్ చేసేసి ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అందుకే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో కూడా అతని పాత్ర హైలైట్ అవుతుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. కానీ, ‘ఆదర్శ కుటుంబం’ లెక్క వేరు. ఇది డార్క్ కామెడీ సినిమా. ఈ జోనర్‌లో పుట్టే హాస్యం ‘సంక్రాంతికి వస్తున్నాం’కి భిన్నంగా, అలాగే సెటైరికల్‌గా ఉంటుంది.
సిట్యుయేషనల్ కామెడీ అని చెప్పుకోవచ్చు.! కాబట్టి బుల్లిరాజు పాత్రకు ఉండే అడ్వాంటేజ్ ఇందులో ప్రజ్వల్..కి ఉండకపోవచ్చు. కానీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌కు ప్రజ్వల్ కామెడీ టైమింగ్ తోడైతే మాత్రం.. బుల్లిరాజు పాత్రకు మించిన అప్రిసియేషన్ లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం.. ఈ అక్టోబర్ 30న ఏం జరుగుతుందో..!