Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ‘ఫౌజీ'(Fauji) గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి ‘ఫౌజీ’ సినిమాపై మొదటి నుంచీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ గ్లింప్స్ మాత్రం సినిమాలో మంచి కంటెంట్ ఉందనే హోప్స్ ఇచ్చింది. ప్రభాస్ పాత్రని పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే ఈ గ్లింప్స్ ఎవరూ ఊహించని విధంగా కొంత వివాదానికి కూడా దారితీసిందని చెప్పాలి.

Fauji

విషయం ఏంటంటే.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్, హిట్లర్ పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రల మధ్య జరిగిన సంభాషణ కొంచెం ‘కేజీఎఫ్’ స్టైల్‌లో ఉంటుంది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ వంటి గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్.. ప్రభాస్ పాత్రకి ఎలివేషన్ ఇవ్వడం.. కొంచెం ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ అనిపించింది. అయినప్పటికీ ప్రభాస్ కటౌట్ నుంచి లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్‌ను ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల ఆడియన్స్ నుంచి మేజర్ కంప్లైంట్ అయితే ఏమీ లేదు.

కాకపోతే సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ‘ఫౌజీ’ యూనిట్‌పై ఫైర్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ‘భారత స్వాతంత్ర పోరాట చరిత్రను, జాతీయ నాయకుల త్యాగాలను వక్రీకరించారంటూ’ ఆయన మండిపడ్డారు. విడుదల చేసిన గ్లింప్స్‌లో స్వాతంత్ర సమరయోధుల చరిత్రను కించపరిచేలా విజువల్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి విజువల్స్ గొప్ప దేశభక్తుడి ప్రతిష్ఠను, ఆయన ఉన్నత స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

కమర్షియల్ హంగుల కోసం, సినిమాటిక్ లిబర్టీని అడ్డుపెట్టుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చరిత్రను తప్పుగా చూపించొద్దని.. వెంటనే యావత్ భారత జాతికి బేషరతుగా క్షమాపణలు తెలియజేయాలని ‘ఫౌజీ’ యూనిట్‌ను చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.

ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus