Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

రైల్వే టికెట్‌ బుకింగ్‌లో తత్కాల్‌ విధానం ఉన్నట్లే సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలోనూ ఉందని మీకు తెలుసా? దీన్ని పెద్ద హీరోల సినిమాలు, పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు ఎక్కువగా వాడుకుంటుంటాయి కూడా. అయితే ఇప్పుడు సినిమా సెన్సార్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తత్కాల్‌ సదుపాయాన్ని తొలగించే ఆలోచనలో ఉందని వార్తలొస్తున్నాయి. దీంతో ఇదేమైనా టాలీవుడ్‌ని ఇబ్బంది పెడుతుందా అనే చర్చ జరుగుతోంది.

Censor Board

సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తర్వాత సెన్సార్ బృందానికి సినిమాను పంపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే సెన్సార్‌ అవ్వలేదు కాబట్టి సినిమా టైమ్‌కి రావడం లేదు అనే మాట వినలేదు. ఎందుకంటే నిర్మాతలు తత్కాల్‌ విధానంలో వెళ్తున్నారు కాబట్టి. అయితే సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించకూడదు అనే నిబంధన ఉంది. కానీ దానిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడు పెద్ద సినిమా సంస్థలు, చిన్న సినిమా సంస్థలు ఇదే పని చేస్తున్నాయి. తిరిగి సెన్సార్‌ దగ్గర ఆలస్యమవుతోంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

2024 నుంచి ఈ సమస్య ఎక్కువైంది. ఎందుకంటే అప్పుడే ఈ తత్కాల్‌ విధానం తీసుకొచ్చారు. రిలీజ్ డేట్‌కి ఐదు రోజుల ముందు స్లాట్ పొందే అవకాశం దొరికింది. దీని వల్ల సెన్సార్ బోర్డు దగ్గర సినిమాలు ఉండిపోతున్నాయి. రూల్స్‌ ప్రకారం ముందుగా అప్లై చేసుకున్న వాళ్ల సినిమాలు కూడా ఇందులో ఉంటున్నాయి. మరోవైపు లాస్ట్‌ మినిట్‌ ఛేంజస్‌ చేయడం వల్ల వాటిని మళ్లీ చూసి ఓకే చెప్పడం సెన్సార్‌ బోర్డుకి కష్టం అవుతోంది. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి తత్కాల్ విధానం ఆపేయాలని కేంద్రం భావిస్తోంది.

దీనిపై నిర్మాతలు, దర్శకుల అభిప్రాయాలను సేకరించాలని రీజనల్ సెన్సార్ ఆఫీసర్లకు సమాచార, ప్రసార శాఖ ఆదేశించిందని సమాచారం. సాధ్యాసాధ్యాలను మార్చి 17లోగా తెలియజేయాలని సూచించిందట. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో 17 తర్వాత తేలనుంది.

రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus